కరీంనగర్‌లో కొత్తగా మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోద్వడం తో కరీంనగర్ పట్టణంలో ఆందోళన నెలకుంది.  దిల్లీలోని మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో ముగ్గురికి, ఇండోనేసియా వారితో సన్నిహితంగా  తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో సుజాత వెల్లడించారు.కరోనా సోకిన బాధితులను సికింద్రాబాద్‌ గాంధీ, కింగ్‌ కోఠి ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. కరీంనగర్‌ నుంచి దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన 19 మందిని గుర్తించామని, వారిలో 11 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో తెలిపారు. మరో ఐదుగురికి సంబంధించి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు.కరీంనగర్‌లో మొత్తం ఇప్పటి వరకు 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన వారిలో 10 మంది ఇండోనేసియా వాసులు ఉన్నారని డీఎంహెచ్‌వో చెప్పారు.

You Might Also Like