కరీంనగర్‌లోని కట్టరాంపూర్‌ ప్రాంతానికి చెందిన వివాహిత (23),భర్త,అత్త ఇద్దరూ ఎలాంటి కారణంలేకుండా తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని, జీవితంపై విరక్తి చెంది తన రెండేళ్ళపాపతో కలిసిఆత్మహత్యానికి పాల్చ్పడబోతుండగా లేక్‌అవుట్‌పోస్టునకు చెందిన పోలీసులురక్షించారు. కరీంనగర్ మానేరుడ్యాం వద్ద సదరు వివాహిత తన రెండేళ్ళ వయస్సుగల పాపతో కలిసి ఆత్మహత్యచేసుకునే ప్రయత్నం చేసింది. డాం వద్ద  వివాహిత కదలికలను గుర్తించిన పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని ఆమెను విచారించారు. భర్త,అత్త ఇద్దరూ ఎలాంటి కారణంలేకుండా తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని, జీవితంపై విరక్తి చెంది ఆత్యాహత్యాయత్స్నం చేశానని వివాహిత తెలిపిందని లేక్‌అవుట్‌పోస్ట్‌ ఇంఛార్జి ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు. అనంతరం సదరు వివాహిత,ఆమె రెండేళ్ళ కూతురును మహిళపోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతిని కాపాడినలేక్‌పోలీస్‌ ఎస్‌ఐ సతీష్‌, సిబ్బందిని కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి అభినందిస్తూ వారికి రివార్డులను ప్రకటించారు.

You Might Also Like