ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు  కష్టనష్టాలకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి  తెలంగాణను కూడా పట్టి పీడిస్తోందని తెలంగాణలో కరోనా వ్యాప్తిని మరింతగా నియంత్రించే ఉద్దేశంతో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాదాపు ఏడు గంటలకు పైగా కొనసాగిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్ డౌన్ అని, భౌతికదూరం పాటిస్తూ విజయం సాధించగలిగామని, మరికొంత కాలం పంటి బిగువనో, ఒంటి బిగువనో ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాకారమవుతుందని అన్నారు. ఇవాళ కొత్తగా 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని, తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096 అని, ప్రస్తుతానికి 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే, రాష్ట్రంలో 2.54 మాత్రమేనని వెల్లడించారు.దేశంలోనే మొదటి కంటైన్‌మెంట్‌ జోన్‌గా ఉన్న కరీంనగర్‌ను కరోనా నుంచి కాపాడుకోగలిగామన్నారు. అక్కడ కరోనా నియంత్రణకు సహకరించిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.తెలంగాణ నుండే ఆగస్టు వరకు కరోనా కు వాక్సిన్ తయారు అవుతుందని ఇందుకు హైదరాబాద్ బయో టెక్ సంస్థలు సిద్దమవుతున్నాయని అయన ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్ర ఆదాయానికి ఉపయోగ పడే భూముల రిజిస్ట్రేషన్లకు వాహనాల రిజిస్ట్రేషన్లకు తాము అనుమతి ఇస్తున్నామని అయన తెలిపారు.కరోనా తో ఇక ముందు కలిసి బతుకాలని ఉపాయం తో అపాయాన్ని గట్టెక్కించు కో వాలని అయన ప్రజలను కోరారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న న్యాయవాదులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందని అడ్వొకేట్  తెలిపారు. మొదటి విడతగా వెంటనే రూ. 15 కోట్లు విడుదల చేస్తున్నామని  ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.దీనికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

You Might Also Like