రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో ప్రతి కుటుంబానికీ రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం నిలివేయాలని, పింఛన్లను యథాతథంగా కొనసాగించాలని మే నెలలోనూ ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనున్నట్లు   సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటిలాగే మే నెలలోనూ రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు.

అయితే లాక్‌డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతుంది కనుక ఈ నెల 1500 రూపాయలు నగదు ఇచ్చే కార్యక్రమం కొనసాగదని తేల్చి చెప్పారు. రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలని కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయిందని లాక్‌డౌన్ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇచ్చినా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరగలేదని రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదన్నారు. రాష్ట్రం ఏడాదికి రూ.37,400 కోట్లను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలని అప్పులను రీ షెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదని దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అయితే అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతలు ఉంటాయని తీర్మానించారు.

లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదన్నారు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదని అధికారులు చెప్పారు. రాష్ట్రం అప్పులను రీషెడ్యూల్ చేయకపోవ డంతో ఏడాదికి దాదాపు రూ. 37,400 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఎఫ్ఆర్‌బీ ఎం పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితిలో లేమని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు పూర్తిగా చెల్లించినట్లయితే రూ.3 వేల కోట్లకుపైగా అవుతుందని.. ఖజానా ఖాళీ అవుతుందని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు.

అధికారులు వివరించిన అంశాలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వేతనాల్లో కోత కొనసాగించాలని నిర్ణయించారు.హైదరాబాద్‌లో రేపటినుంచి మాల్స్ మినహా అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ప్రస్తుతం నగరంలో సరి-బేసి విధానంలో దుకాణాలు తెరిచేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఒకే దుకాణంలో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా సరి-బేసి నిబంధనను ఎత్తివేసింది. ఎక్కువ దుకాణాలు తెరిచి, తక్కువ మంది ఉండే విధానాన్ని అనుసరించాలని దుకాణదారులకు ప్రభుత్వం సూచించింది.

దుకాణ యజమానులు, వినియోగదారులు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిచాలని ప్రభుత్వం ఆదేశించింది.రాష్ట్ర ఆదాయం బాగా తగ్గిపోయిన నేపథ్యంలో ప్రతి కుటుంబానికీ రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం నిలివేయాలని, పింఛన్లను యథాతథంగా కొనసాగించాలని మే నెలలోనూ ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనున్నట్లు   సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. పొరుగుసేవలు, ఒప్పంద ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటిలాగే మే నెలలోనూ రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. అయితే లాక్‌డౌన్ సడలింపుల కారణంగా కార్మికులు, కూలీలకు మళ్లీ పని దొరకుతుంది కనుక ఈ నెల 1500 రూపాయలు నగదు ఇచ్చే కార్యక్రమం కొనసాగదని తేల్చి చెప్పారు.

రాష్ట్రానికి ప్రతీ నెలా 12వేల కోట్ల వరకు ఆదాయం రావాలని కానీ లాక్ డౌన్ కారణంగా ఆదాయం మొత్తం పడిపోయిందని లాక్‌డౌన్ నిబంధనలలో కొన్ని సడలింపులు ఇచ్చినా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పెరగలేదని రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదన్నారు. రాష్ట్రం ఏడాదికి రూ.37,400 కోట్లను అప్పులకు కిస్తీలుగా చెల్లించాలని అప్పులను రీ షెడ్యూల్ చేయాలని కేంద్రాన్ని కోరినా స్పందించలేదని దీంతో కిస్తీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అయితే అప్పుల కిస్తీలను విధిగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసుల వేతనాల్లో 60 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్లలో 25 శాతం కోతలను మే నెలలో కూడా కొనసాగించాలని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోతలు ఉంటాయని తీర్మానించారు.లాక్ డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదన్నారు. రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర రంగాల్లో ఆదాయం పెద్దగా రాలేదని అధికారులు చెప్పారు. రాష్ట్రం అప్పులను రీషెడ్యూల్ చేయకపోవడంతో ఏడాదికి దాదాపు రూ. 37,400 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.


ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితిలో లేమని అధికారులు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు పూర్తిగా చెల్లించినట్లయితే రూ.3 వేల కోట్లకుపైగా అవుతుందని.. ఖజానా ఖాళీ అవుతుందని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. అధికారులు వివరించిన అంశాలను పరిశీలించిన సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వేతనాల్లో కోత కొనసాగించాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లో రేపటినుంచి మాల్స్ మినహా అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ప్రస్తుతం నగరంలో సరి-బేసి విధానంలో దుకాణాలు తెరిచేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఒకే దుకాణంలో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా సరి-బేసి నిబంధనను ఎత్తివేసింది. ఎక్కువ దుకాణాలు తెరిచి, తక్కువ మంది ఉండే విధానాన్ని అనుసరించాలని దుకాణదారులకు ప్రభుత్వం సూచించింది. దుకాణ యజమానులు, వినియోగదారులు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిచాలని ప్రభుత్వం ఆదేశించింది.

You Might Also Like