కరోనా  వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది.వైరస్ కంట్రోల్ కు అధికారులు అహర్నిశలు పనిచేస్తుండగా మరి  కొందరు అధికారులు మాత్రం సామజిక దూరాన్ని పాటించకుండా అడ్డదారిలో లిక్కర్ ను తెప్పించుకుని  విందు వి నోదాల్లోతేలియాడుతున్నారు. ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ సైదులు, ఇద్దరు వీఆర్వోలు, ఈవోఆర్డి రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి కలిసి మాటూరు పేట పీహెచ్సీ డాక్టర్ శ్రీనివాస రావు గెస్ట్ హౌస్ లో ఎంజాయ్ చేయడానికి ఓ సిట్టింగ్ వేశారు. అది కాస్తా మీడియా ద్వారా బయట పడటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇంకా తాగుడు షురువైందో లేదో కానీ పోలీసులు రావడాన్ని గమనించిన తాసిల్దార్ సైదులు, ఈవో ఆర్ డి రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్ పరారైయ్యారు. డాక్టర్ శ్రీనివాస్ ను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కి సంబంధించి ఓ కారు, రెండు బైక్ లు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.అయితే వీరికి మద్యాన్ని స్థానిక ఎక్సైజ్ సీఐ సప్లై చేశారాణి తెలుస్తుండగా బాధ్యత గల అధికారులే ఇలా నిబంధనలు పాటించకుండా వ్యవరించడాన్ని స్థానిక ప్రజలు తప్పుపడుతున్నారు  ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

You Might Also Like