నిరాధారమైన కథనాలను రాయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురు విలేకరులను పోలీస్ లు రెడ్ హండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేసిన సంఘటన ఇది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన మాజీ డిసిసిబి  చైర్మన్ మువ్వ విజయ్ బాబును సూర్య పత్రిక విలేకరులు బ్లాక్ మెయిల్ చేస్తూ  గత కొద్ది రోజులుగా విజయ్ బాబుపై ఆ  పత్రికలో కొన్ని కథనాలు ప్రచురిస్తున్నారు.

ఇదేంటని ప్రశ్నిచిన విజయబాబు ను 30 లక్షల రూపాయలు ఇస్తే రాయడం ఆపేస్తామని సూర్య పత్రిక విలేకరులు సమాధానమిచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని బ్రతిమిలాడినా విజయ్ బాబు ను కనీసం 15 లక్షల రూపాయలు అయినా ఇస్తే తాము కథనాలు రాయడం నిలిపి వేస్తామని కోరారు.అయితే తాను అంత ఇవ్వలేని ఆయన స్పష్టం చేశారు. చివరకు ప్లాన్ ప్రకారం  ఐదు లక్షల రూపాయల నగదు, 500 పత్రికలకు సంవత్సర చందా కట్టే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.ఆ డబ్బులు తీసుకోవడానికి పత్రిక ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ మూర్తి,  జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, సత్తుపల్లి రిపోర్టర్ నిమ్మగడ్డ శ్రీకాంత్ విజయ్ బాబు  గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పడం తో అక్కడికి   వెళ్లి డబ్బులు డిమాండ్చేయడం తో అక్కడే ఉన్న  సత్తుపల్లి సీఐ రమాకాంత్ సిబ్బందితో వచ్చి వారిని రెడ్ హాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

You Might Also Like