సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై కొందరు చేసిన దాడి తో పాటు నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని ఒక వర్గం వారు అడ్డుకోవడంపై  తెలంగాణ ఐటీ, ముస్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రాణాలకు తెగించి కరోనా వైరస్‌ బాధితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న వైద్య సిబ్బందిపై కొంతమంది దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు వారి విధులకు అడ్డు పడుతున్నారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదనిహెచ్చరించారు.


ఈ ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని గురువారం ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ‘గాంధీ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందిపై దాడి, నిజామాబాద్‌లో వైద్య సిబ్బందిని అడ్డుకున్న ఘటనలను సహించేది లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు మూర్ఖులే కాకుండా వారివల్ల ఇతరులకు కూడా ప్రమాదమే’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

You Might Also Like