మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం తమదని కేసీఆర్ చెబుతున్నట్లు తాము ఏదైనా అంటే చేస్తాం అని నిరూపించింది తెలంగాణా సర్కార్.కరోనావ్యాప్తి వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్ తో  ప్రజలు బయటకు రాకపోవడం ఇంటికే పరిమితం కావడం తో రెక్కాడితే గాని డొక్కాఆడని  పేదలకు కొంతలో కొంత  ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం నగదు బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు  74 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.


లాక్ డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించిన మేర ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. అందుకోసం మొత్తం రూ.1,112 కోట్లు కేటాయిస్తున్నట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఆయా బ్యాంకులకు బదిలీ చేశామని తెలిపారు.

https://twitter.com/KTRTRS/status/1249721721180966912

You Might Also Like