కరోనా వైరస్ బారిన పడిన వారికి వైద్యం అందించేందుకు అత్యాధునిక వసతులతో  350 పడకల ఆసుపత్రి సిద్ధమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు తెలిపారు.కింగ్ కోటి లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని వినియోగించేందుకు అన్ని వసతులు ఏర్పాటు చేశామని దీని తో పాటు ఎమర్జెన్సీ గా హైదరాబాద్ లోని మరో నాలుగు చోట్ల అత్యదినికమైన వైద్య పరికరాలతో ,బెడ్లతో అన్ని వసతి సౌకార్యాలతో హైయోజెనిక్ గా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్  స్వయం గా ఈ నిర్మాణాలని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఆపద సమయం లో అన్ని హంగులు సమకూర్చుకుని కరొనపై పోరాడుదామని అయితే సామజిక దూరమే ఈ వ్యాధి  సంక్రమణకు కారణమని ప్రివెంటివ్ ఇస్ బెటర్ థన్ కుర్ అన్నచందం గా వ్యాధిని రాకుండా చూసుకోవడమే ఉత్తమమని అందుకు ఇంటి నుండి అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ప్రజలను కేటీఆర్ కోరారు.

You Might Also Like