కరోనా వైరస్‌ ప్రబల కూడదనే ఉదేశ్యం తో ప్రభుత్వం  లాక్‌డౌన్‌ ప్రకటించగా దేశ వ్యాప్తం గా బంద్ కొనసాగుతుంది. దీనిలో భాగం గా మద్యం షాప్ లు కూడా మూత  పడటంతో మందు దొరకక మందుబాబులు కొందరు వింతవింతగా ప్రవర్తిస్తున్నారు.మరి కొందరు మందు కల్లుకు బానిసలై అది దొరకక పోవడం తో  పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తుండగా మరి  కొందరు ఆత్మ హత్యకు పాల్పడటం,ఇంకొందరు ఆత్మ హత్యకు యత్నించడం గమనార్హం.

ఈ నేపథ్యంలో తెలంగాణాలో ఆయా జిల్లాల నుండి ఇలాంటి కేసులు హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో వైద్యులు రెఫెర్ చేయడం తో  ఇక్కడ ఓపీ కోసం రోగుల తాకిడి పెరిగింది. లాక్ డౌన్ ప్రకటించినప్పటినుండి ఒకటి రెండు కేసులు రాగా నిన్న ఏకంగా 50 మంది, ఈ రోజు 100 మందికి పైగా బాధితులు ఆస్పత్రికి వచ్చి పరీక్షలకి క్యూ కడుతున్నారు.ఇందులో హైదరాబాద్ నిజామాబాద్,కామారెడ్డి జిల్లాకు చెందినా వారే అధికం గా ఉండగా కల్తీ కల్లుకు బానిసయినా ఆడవారు ,మగవారు కూడా ఉన్నారు.ఇలాగె కొనసాగితే ఎర్రగడ్డ  మెంటల్ ఆసుపత్రి బాధితులతో నిండి పోయే అవకాశముందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

You Might Also Like