గురువారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. దీనిని  వైద్య ఆరోగ్య శాఖ ధ్రువిరించింది.తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం నాటికి 154కు చేరింది. తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 9 మంది మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇవాళ ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 17 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు అధికారులు చెప్పారు.కాగా పెరుగుతున్న కేసులు మర్కజ్ ప్రార్థనలలో పాల్గొన్నవారినుండి అంటుకున్నాయని వ్యాధి వ్యాప్తి ద్వారా కేసులు పెరగలేదని తెలుస్తుంది.

You Might Also Like