నిజామాబాద్ జిల్లా దోమకొండకు కు చెందిన తమ బంధువు ఉమాపతి రావు ను చివరి చూపు చూడటానికి  చిరంజీవి, రామ్ చరణ్ ఉపాసన దంపతులు దోమకొండకు  చేరుకున్నారు.  ఆదివారం నిర్వహించిన ఉమాపతి రావు అంత్యక్రియలకు సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఉపాసన దంపతులు, అపోలో చైర్మన్ ప్రతాప రెడ్డి,సినీ ప్రముఖులతో పాటు, అపోలో ఆసుపత్రి సిబ్బంది, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కాగా ఉమాపతి రావు అంతక్రియలు నిర్వహించేటప్పుడు అదే ప్రాంతంలో ఉన్న చెట్టుకు ఉన్న కందిరీగలు చుట్టుముట్టడంతో, చిరంజీవితో పాటు అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖులు పరుగులు పెట్టారు

దోమకొండ వాసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసిన కామినేని ఉమాపతి రావు (92), గత బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే ఉమాపతి రావు అంత్యక్రియలను ఆదివారం రోజు దోమకొండ సంస్థాన గడికోటలో నిర్వహించారు. కాగా ఉమాపతి రావు చితికి కుమారుడు అనిల్ కుమార్ నిప్పంటించారు.1928లో జన్మించిన ఉమాపతి రావు పలు జిల్లాలకు కలెక్టర్ గా పనిచేశారు. అలాగే టీటీడీ దేవస్థానం ఈవోగా పని చేశారు.కాగా రాంచరణ్ భార్య ఉపాసన వైపు నుండి వీరు చిరంజీవి బంధువులు .

You Might Also Like