కరీంనగర్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తప్పవని కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణ దిశగా కొన్ని జిల్లా యంత్రాగము ప్రభుత్వ అనుమతితో కఠినమైన నిర్ణయాల్ని తీసుకోవాల్సి వస్తుందన్నారు. కరోనాను అరికట్టే దిశగా ఇప్పటికే తీసుకున్న కొన్ని నిర్ణయాలతో పాటు ఇక మీదట కూడా వైరస్ సోకకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండేలా ప్రణాళికలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఇందుకు నగర ప్రజలంతా సంపూర్ణ సహకారాన్ని అందించాలని, ఈ రెండు వారాలు కీలక మని ప్రతి ఒక్కరు భావించాలని సామాజిక దూరం పాటిస్తూ లాక్ డౌన్ పాటించాలని అయన కోరారు.

You Might Also Like