రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతులకు భరోసా ఇచ్చారు.జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో డిసిఎంఎస్ అద్వర్యం లో  మక్కల కొనుగోలు కేంద్రాన్నిఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 23, 214 ఎకరాలలో మక్కజొన్న సాగు చేయగా 5,72,000 క్వింటాలు దిగుబడి వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 378 మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైతులు పంటల కొనుగోలుపై ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్  ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి , నాయకులు నక్క శంకర్ గొస్కుల జలెందర్, గొల్లపల్లి  ఛైర్మన్ రాజ్ సుమన్ , చందోళి  ఛైర్మన్ వెంకట మాధవ రావు , వైస్  ఆవుల సత్యం  మండల అధ్యక్షులు బొల్లం రమేష్ లు పాల్గొన్నారు.

You Might Also Like