దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టల్‌ నిర్వాహకులు వెంటనే విద్యార్ధులను ఖాళీ చేయాలన్నారు. దీంతో వారు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హాస్టల్ నిర్వహకులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్కరనీ కూడా హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించవద్దని, అనవసరంగా భయాందోళనను సృష్టించవద్దని నిర్వాహకులకు సూచించారు.ఈ మేరకు ఆయన జి హెచ్ ఎం సి చైర్మన్ బొంతు రామ్మోహన్ ,వైస్ చైర్మన్ బాబా ఫసియుద్దీన్లను ఈ వ్యహారం ను చూడామణి ఆదేశించారు.

దీనితో చైర్మన్ బొంతు రామ్మోహన్ డిప్యూటీ స్పీకర్ పద్మారావు తో కలిసి నానక్ రామ్ గూడా వెళ్లి  హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యాలను అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వాహకులు తో మాట్లాడి వారికి భోజన సౌకర్యం కల్పించారు.మరో వైపు వైస్ చైర్మన్ బాబా ఫసి వివిధ ప్రైవేట్ హాస్టల్ లకు చేరుకొని హాస్టల్ నిర్వాహకుల తో మాట్లాడి వారికి అండగా ఉంటామని మాట ఇచ్చి సమస్యను పరిష్కరించారు.మొత్తానికి మంత్రి కేటీఆర్ చొరవతో విద్యార్థులకు వసతి భోజన సౌకర్యం దొరకడం తో వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

You Might Also Like