కరోనా మహమ్మారి ప్రబలడం తో  ప్రభుత్వం ప్రకటించిన  లాక్ డౌన్  మనుషులనే కాదు జంతువులను కూడా బాధిస్తుంది. లాక్ డౌన్ నేపథ్యంలో భక్తుల రాకపోకలు లేక, ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆహారం లభించక కోతులు అలమటిస్తున్నాయి. అంజన్న దర్శనానికి వేలాదిగా భక్తులు విచ్చేసే భక్తులు వాటికి ఎదో ఒకటి పెట్టడం తో ఇన్నాళ్లు వాటికి ఆకలి బాధ తెలియలేదు.లాక్ డౌన్ నేపత్యం లో భక్తులు  లేక వాటికి ఆహారం వేసేవారు కరువయ్యారు. ప్రస్తుతానికి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో విధులు నిర్వర్తించే కొందరు, స్థానికులు పండ్లు, బిస్కెట్లు, పుట్నాలు పోసి కోతుల ఆకలి తీర్చుతున్నారు. అయినా వాటికి ఆకలి తీరడం లేదు.అటు అడవులు ఉన్న వాటిలో పండ్లు ఫలాలు లేకపోడం తో  ఆకలి తీర్చుకోడానికి  కోతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి..అన్నదాతలు, స్వచ్చంద సంస్థల వారు దాతలు ముందుకు వచ్చి అంజన్న స్వరూపం గా భక్తులు భావించే  కోతుల ఆకలి తీర్చాలని కోరుతున్నారు

You Might Also Like