పుణ్య క్షేత్రమైన వేములవాడ పట్టణం లో బిక్షాటన పై నే ఆధార పడ్డ యాచకులకు గత వారం రోజులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్ర శర్మ అద్వర్యం లో అన్నదాన కార్య క్రమం చేస్తూ భిక్షుకుల కడుపు నింపుతున్నారు.వేములవాడ లో వందలాది మంది బిక్షాటనే పై నే అదర పడి బతుకు తుండగా లచ్క్ డౌన్ నేపత్యం లో ఆలయంలో దర్శనాలు బంద్ చేసిన అధికారులు అన్న సత్రాన్ని కూడా మూసివేశారు. ఈ నేపత్యం లో యాచకులకు ఆకలి తో అలమటించే కూడాదనే ఉద్దేశ్యం తో ప్రతి రోజు వేములవాడ గుడి వెనుక మధు రాజేందర్ నేతృత్వం లో అన్నదాన కార్య క్రమం నిర్వహిస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారు.మధు రాజేందర్ కు అండగా స్థానిక కాంట్రాక్టర్ మహ్మద్ రఫీ అతని మిత్రులు ఈ అన్న దానానికి తమ వంతు సాయం అందిస్తున్నారు.ఉన్న దాంతో ఈ కష్ట కాలం లో అందరి ఆకలి తీర్చడం తమ బాధ్యత అని మధు రాజేందర్ శర్మ ,రఫీ  రాజేంద్ర ప్రసాదులు అంటున్నారు.అన్నదాత సుఖీ భావ అనేకంటే మనం ఎం చేద్దాం.

You Might Also Like