ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన ప్రార్థన కార్యక్రమానికి హాజరై వచ్చిన నలుగురి ని స్థానిక వైద్య బృందం , పోలీసులు గుర్తించడం తో వేములవాడ పట్టణం  లో కలకలం  నెలకుంది.వేములవాడ పట్టణానికి చెందిన ఒక మౌల్వీ తో పాటు ముగ్గురు యువకులను   ఐసోలేషన్ కు తరలించారు. ఖాజామియా ఈ నెల 10వ తేదీన వేములవాడ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ద్వారా విమానం లో వెళ్లిన నలుగురు ఢిల్లీలో  15 వ తేదీ వరకు మర్కజ్ ప్రార్ధన మందిరం సమావేశాలకు హాజరయ్యారు.ఈ నెల 17న రామగుండము  కు చేరుకొని బస్సు ద్వారా వేములవాడకు చేరుకున్నాడు.


పట్టణానికి చెందిన మహ్మద్ అర్బాజ్ అలీ (20 ) మహ్మద్ జాకీర్ (31)MD హస్మత్ అలీ (21) మొహ్మద్ షాకీర్ (22 )లను గుర్తించిన ఫైద్యాధికారి మహేష్ రావు తన సిబ్బంది తో కలిసి వారిని సిరిసిల్ల ఆసుపత్రికి ఐసోలెషను కు పంపారు.అక్కడి నుండి వారందరిని గండి ఆసుపత్రికి కరోనా పరీక్షలకై పంపించనున్నట్లు తెలిపారు.అలాగే వారందరు ఢిల్లీ నుండి వచ్చాక కలిసిన 21  మందిని చెక్కపల్లి లోని క్వారయింటెన్లో ఉంచుతూ మిగతా వారి ఇండ్లకు నోటీసులు జారీ చేశారు.

ఈ సంఘటనతో వేములవాడ ప్రజలు భయబ్రాంతులకు గురై ఇండ్లల్లోంచి బయటకి వెళ్లడం లేదు.ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు వార్త ప్రచారం కావడం తో రాజన్న సిరిసిల్ల  జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.  ఎవరు ఆందోళన చెందవద్దని, ప్రజలు ఇళ్లలోంచి బయటకి రావద్దని వైద్యాధికారి మహేష్ రావు పోలీస్ అధికారులు చంద్రకాంత్ ,శ్రీధర్ లు  సూచించారు. 

మర్కజ్ కు వెళ్లిన వాళ్లకు దాదాపు గా కరోనా ఉందని ప్రచారం కావడం తో ఈ నలుగురి రిపోర్ట్ ల  పైనే వేములవాడ భవిష్యత్తు ఆధారపడి ఉందని వీరు ఢిల్లీ నుండి వచ్చాక ఇక్కడ యథేచ్ఛగా తిరిగారని వీరి ద్వారా కరోనా వ్యాప్తి చెందితే వేములవాడ లో రెడ్ అలెర్ట్ ప్రకటించే అవకాశముంది.

You Might Also Like