ఒక బాలుడు అతని తాత తో కలిసి ఆపరేషన్ కు  గుంటూరు జిల్లాకు వెళ్లి రాగా బాలుడికి కరోనా పాజిటివ్ సోకినట్లు బాలుని తాతకు నెగటివ్ గా నిర్దారణ అయినట్లు తెలియడం జగిత్యాల  జిల్లాలో  పలు అనుమానాలకు తావిస్తుంది.జగిత్యాల మండలంలోని ఓ గ్రామంలో అయిదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆర్డీవో నరేందర్‌, జిల్లా ఉప వైద్యాధికారి జైపాల్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా కేంద్రంలో బధిరులకు  ఉచిత శస్త్ర చికిత్స చేస్తుండటంతో ఇటీవల అక్కడికి తీసుకెళ్లి శస్త్ర చికిత్స చేయించారు. రెండు రోజుల క్రితం గ్రామానికి తీసుకురాగా గ్రామస్థులు వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. బాలుడి రక్త నమూనాలు పంపించడంతో బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బుధవారం అర్ధరాత్రి అధికారులు ఆ బాలుడిని హైదరాబాద్‌కు తరలించారు.బాలుడు ఉండే ఏరియాను రెడ్ జోన్ గా ప్రకటిస్తూ  అధికారులు గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు.కాగా బాలుడికి ఆపరేషన్ చేసిన డాక్టర్ మరియు సిబ్బంది  ఆపరేషన్ తరువాత బాలుడు కలిసిన వారి వివారాల పై పోలీసులు ఆరా తీస్తూ జైతుర్కు సమాచారం అందజేశారు.

You Might Also Like