రాజన్న సిరిసిల్ల జిల్లా లో జిల్లా పోలీసు యంత్రాంగం అద్వర్యంలో  కరోనా నివారణ చర్యలల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలోని ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ ను చేపడుతుండగా  ప్రదాన రహదారులు నిర్మానుషమయ్యాయి.జిల్లా పరిపాలన యంత్రాంగము ,పోలీసులు కలిసి ఆయా గ్రామాల కు వేరే ప్రాంతాలనుండి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచి తీసుకోవాల్సిన ముందస్తు వ్యక్తి గత పరిశుభ్రత గురించి, నివారణ చర్యలను గురించి అవగాహన కల్పిస్తున్నారు.దీనితో వేములవాడ,సిరిసిల్ల ప్రాంతాలలో జనాలు రోడ్పైకి రాకపోవడంతో వీధులన్నిబోసిపోయాయి.మంత్రి కెటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ క్రిష్ణభాస్కర్,ఎస్పీ రాహుల్ హెగ్డే లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


You Might Also Like