భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వేపలగడ్డ గ్రామంలో సీపీఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాతదళ సభ్యుడు   ఆరెం నారాయణ అలియాస్ నరేష్ ను అతని ఇంటి వద్ద పోలీసులు అదుపులో తీసుకున్నారు.  విచారించగా అతను తన నేరాలను  ఒప్పుకోవడం జరిగింది. నరేష్ కుటుంబ కలహాలతో 2011లో సీపీఐ ఎం ఎల్ న్యూ డెమాక్రసి  అజ్ఞాత దళ సభ్యుడైన లింగన్న ప్రోద్బలంతో అజ్ఞాత దళంలో చేరి,అప్పటి నుండి పార్టీలో వివిధ ప్రదేశాలలో పనిచేస్తూ 2019 గుండాల మండలం రోళ్లగడ్డ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో, అనంతరం పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులను విడిపించుకపోవడంలో  కీలక పాత్ర పోషించాడు.

ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో  వివిధ నేరారోపణలు,కేసులు నమోదు అయ్యాయి.ఈ రోజు పట్టుబడిన నరేష్ యొక్క తల్లి ఆరోగ్యము బాగలేనందున ఇంటికి రావడం జరిగింది.  జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు ఓఎస్డీ రమణారెడ్డి,ఇల్లందు DSP రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో  గుండాల సిఐ శ్రీనివాస్ మరియు ఎస్సై రమేష్  వారి సిబ్బంది నాగరాజు,రాంబాబు,నాగేశ్వర రావు, స్పెషల్పార్టీ  పోలీస్  అదుపులోకి తీసుకొని  విచారించగా తన నేరాన్ని ఒప్పుకున్నాడు.అతని వద్ద నుండి 8 ఎం ఎం రివాల్వర్ ,10 తూటాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.జ్యూడిషియల్ రిమాండ్ నిమిత్తం ఈ రోజు కోర్టు నకు తరలించామని  సిఐ శ్రీనివాస్ వెల్లడించారు.

You Might Also Like