పాత ప్రియురాలే కానీ పెళ్లయింది ఇద్దరు పిల్లలు కూడా అయితే తనను ప్రేమిస్తున్నానని శారీరకం గా వాడుకుంటున్న ప్రియుడిని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకే ఆ మహిళను పథకం ప్రకారం దారుణంగా హత్య చేసినట్లు  సైబరాబాద్‌ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. పైగా తనను ప్రాణ ప్రదం గా  ప్రేమించిందనే విషయాన్ని మరిచి పోయి హత్యకు ముందు స్నేహితునితో  కలిసి కారులోనే ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు. 

దిశ ఘటన తర్వాత తెలంగాణాలో అంతే సంచలనం సృష్టించిన  తంగడపల్లి మహిళా హత్య కేసు విచారణలో పోలీసులకు అనేక కొత్త అంశాలు తెలుస్తున్నాయి.నిందితుల్లో ఒకరు పోలీసులకు చిక్కగా  పరారిలో ఉన్న ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం  ప్రత్యేక బృందాలు ముంబయితో పాటు పలు ప్రాంతాల్లో వెతుకుతున్నాయి.

మార్చి 17న రంగారెడ్డి చేవెళ్ల మండలం తంగడపల్లి పై వంతెన కింద  ఓ గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురి కాగా ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. వివాహం కాకముందు నుంచే మృతురాలు, పరారీలో ఉన్న మరో నిందితుడు ప్రేమలో ఉన్నారని ,ఆమె పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతుండగా తానూ భర్త నుండి వచ్చేస్తానని పెళ్లి చేసుకునిఎక్కడికైనా దూరంగా వెళ్లి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామంటూ ఆమె అతని పై ఒత్తిడి తెచ్చింది.ఈ మధ్య కాలం లో  వేరే అమ్మాయికి దగ్గర కావడం,పెళ్లయి పిల్లలున్న మహిళను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆమెను దూరంగా పెడుతుండగా ఆమె అతనిపై తీవ్రమైన ఒత్తిడి తేవడం తో ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే హత్య చేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు వివరించినట్లుగా తెలుస్తోంది.

తనను బెదిరిస్తున్న ఆమెను లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామంటూ  నమ్మించి కారులో ఎక్కించుకుని ఆమెను మొదట తానూ శారీరకం గా కలిసి ఆ తెరువాత తన స్నేహితుణ్ని ఆమెపై ఉసిగొల్పి కారులోనే అతని తో అత్యాచారం చూపించాడు.అడ్డు తిరిగిన ఆమెను గొంతు నులిమగా ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది.అనంతరం దుస్తులు లేకుండానే మృతదేహాన్ని పై వంతెన కిందకు దించి తలను  బండరాయి తో నుజ్జు నుజ్జు చేసి వెళ్లి పోయారని పోలీస్నిం విచారణ లో తేల్చారు. వారు తిరిగిన అద్దె కారు జిపిఎస్ సిస్టం తో పాటు , లభించిన సీసీ ఫుటేజీ ద్వారా ఈ ఇద్దరే నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడు దొరికితే మృతురాలికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు తెలిసే అవకాశం ముంది.

You Might Also Like