రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. కలెక్టరేట్ లోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం ఆయన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ పరంగా చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో రైతులకు టోకెన్లు జారీ చేసి విడతల వారీగా గ్రామాల్లోనే వరి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులంతా క్రమశిక్షణతో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఒకేరోజు అందరి ధాన్యం కొనుగోలు సాధ్యం కాదని పేర్కొన్నారు. అందువల్ల టోకెన్‌పై ఉన్న తేదీ ప్రకారమే రైతులు ధాన్యం అమ్మకానికి రావాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు

You Might Also Like