ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్‌ పొడిగించినందున ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో లాక్ డౌన్ పకడ్బందీ గా అమలయ్యేలా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ శ్రీ ఆర్ అంజయ్య, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ గౌతమ్ రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీ రవీందర్ లతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ లాక్ డౌన్, ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలన్నారు.

లాక్ డౌన్ ముగిసే వరకు జిల్లాలోకి వ్యక్తుల ప్రవేశం లేకుండా సరిహద్దు చెక్ పోస్టుల.వద్ద తనిఖీ వ్యవస్థను పటిష్ఠం చేయాల న్నారు .నిత్యావసర సరుకులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంట వరకే అనుమతించనున్నట్లు చెప్పారు. కూరగాయలు మార్కెట్, మాంసం విక్రయ కేంద్రాల వద్ద జనసమ్మర్థం ఎక్కువ ఉంటుందనీ, భౌతిక దూరం పాటించడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. నిబంధనలు ఉల్లంఘనలు జరిగితే విక్రేతలు, వినియోగ దారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిత్యవసర వస్తువులను కొనే సమయంలో ప్రజలు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. మాస్క్ లు విధిగా ధరించా లన్నారు. 


వేములవాడ రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో లోపలివారు బయటకు, బయటి వ్యక్తులు లోపలికి వెళ్లకుండా ఉండేందుకు బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రెడ్ జోన్ లో ఉల్లంఘనలు జరగకుండా పటిష్ట నిఘా పెట్టాలని అన్నారు. ఎవరైనా అనుమానితులుంటే వారిని గుర్తించి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించాలని పోలీసులు,వైద్యసిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 3 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యయన్నారు. రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో శానిటైజేషన్‌ను చేపడుతున్నట్లు వెల్లడించారు. అన్నిరకాల నిత్యావసర వస్తువులు వారి ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని చెప్పారు.. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి స్వీయ నిర్బంధం పాటించాల్సిందిగా కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.


అకారణంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తాం: ఎస్పి కరోనా వైరస్ ను కట్టడి చేసి అందుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను విధించిందనీ జిల్లా ఎస్పి శ్రీ రాహుల్ హెగ్డే తెలిపారు. ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు . నిబంధనలను ఉల్లంఘించి అకారణంగా బయటకు వస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వారి వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని వాహనదారులనుహెచ్చరించారు.ఇప్పటి వరకు జిల్లాలో 80 కి పైగా వాహనదారులపై కేసులు నమోదు చేశామని, సీజ్‌ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. లాక్‌డౌన్‌ తర్వాత కూడా వాహనాలు తీసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. నిత్యవసరవస్తువుల కొనే సందర్భంలో బైక్ పై ఒక్కరూ మాత్రమే రావాలన్నారు. ఒకరికి మించి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.అనుమతి లేకుండా జిల్లాలోకి ప్రవేశించే వ్యక్తులపై వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అని ఎస్పీ తెలిపారు. అనుమతి లేకుండా ప్రవేశించి వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా క్వారన్ టై న్ కు పంపుతామని ఎస్పి తెలిపారు.అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ శ్రీ ఆర్ అంజయ్య, అధికారులతో జిల్లాలో లాక్ డౌన్ పటిష్ఠ అమలకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

You Might Also Like