విడి నిర్వహణలో  అలసత్వం చూపిన ముగ్గురు మున్సిపల్ అధికారులపై జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కొరడా  ఝళిపించారు.ఇందులో ఇద్దరి ఉద్యోగులకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందజేయగా మున్సిపల్ కమిషనర్ కు ఛార్జ్ మెమో అందజేసి 24  గంటల్లో  వివరణ ఇవ్వాలని కోరుతూ క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కంటైన్మెంట్  ఏరియా లోకి ప్రవేశం నిషిద్దమైనప్పటికీ వేములవాడ లోని సుభాష నగర్ రెడ్ జోన్ లోకి  ప్రవేశించి కూరగాయలు గుడ్లు అందజేసిన టి ఆర్ కె ట్రస్ట్ సభ్యులను నిలువరించక పోయినందున మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి సంజాయిషీ నోటీసు ఇస్తూ కార్యాలయ సిబ్బంది రధం  శ్రీనివాస్  ,శ్రావణ్ కుమార్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.ఆ ఏరియా లో ఇలాంటి నిత్యావసర వస్తువులు అందజేయడానికి ఎవరు వెళ్లకూడదని నిత్యావసర సరుకులు అందజేయడానికి  టి ఆర్ కె ట్రస్ట్ సభ్యులను ఎవరు ,ఎందుకు పంపించారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వారు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆ కంటైన్మెంట్ జోన్ లో అధికారులకు అందజేయాలని లేకుంటే వెళ్లిన వారికి వ్యాధి అంటుకునే ప్రమాదముందని ఆయన తెలిపారు.ఇందులో బాధ్యత లేకుండా ప్రవర్తించిన మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ రధం శ్రీనివాస్,టెక్నికల్ అసిస్టెంట్ శ్రావణ్ కుమార్ లను సస్పెండ్ చేసిన కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కి  ఛార్జ్ మెమో అందజేసి 24  గంటల్లో  వివరణ ఇవ్వాలని కోరుతూ వివరణ ఇవ్వకుంటే మరో నోటీసు ఇవ్వకుండానే  క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.కాగా టి ఆర్ కె ట్రస్ట్  చేస్తున్న సేవలను వారు ప్రజల్లోకి దూసుకుపోతున్న స్పీడ్ న చూసి ఓర్వలేకనే కొందరు జిల్లా యంత్రాంగానికి పిర్యాదు చేసి ఉంటారని దీనిపై కలెక్టర్ చర్య తీసుకుని ఉంటాడని వాదనలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా సేవ కార్యక్రమానికి  మున్సిపల్ ఉద్యోగులు బలవడం బాధాకరం.You Might Also Like