కరోనా వైరస్ (కొవిడ్ -19)మహమ్మారి గురించి దాని వాళ్ల జరిగే అనర్ధాల  గురించి మారు మూల  పల్లె ప్రజలకు సైతం అవగాహన కల్పించాలనే  సంకల్పం తో  ప్రాచీన సాంప్రదాయ ప్రసార సాధనాలను రంగంలోకి దించి రాష్ట్రము లో ఎక్కడ లేని విధం గా వినూత్న ప్రయోగం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు.


కళాజాతాల ద్వారా దూం దాం పాటలతో పసి పిల్లల నుండి పండు ముసలి వాళ్ళను సైతం పుడితే ఒకటి సత్తే రెండు అంటూ ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర శేఖర్ రావు నే స్ఫూర్తి గా తీసుకున్నా జిల్లా అధికారులు  శాస్త్ర సాంకేతికకు అంతు చిక్కని జబ్బు గా భావిస్తున్న కరోనా వైరస్ పై ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్దులకు ,సామాన్య జనానికి అర్థం అయ్యేట్టుగా  ప్రాచీన సాంప్రదాయ ప్రసార సాధనాలయిన పాఠాలు, పద్యాలూ,ఒగ్గు కథలు,హరి కథలు రూపం లో కళాజాతాలను రంగం లో కి దించారు .ప్రబలుతున్న వ్యాధులపై ప్రజలకు  చైతన్యం కల్పించడం కళాకారులతోనే సాధ్యమని భావించి  వారిచేత పాటలు పాడించారు. కళాకారులు కూడా ఇటువంటి మహమ్మారిపై అవగాహన కల్పించడం తమ బాధ్యత అని తెలిపి ఉచితంగానే ప్రదర్శనలకు అంగీకరించారు.ఒగ్గు కళాకారులు వారి శైలిలో చెబుతున్న ఒగ్గు కథ లు,పేరడీలతో కూడిన పాట లు ,జానపద బాణీలతో కూడిన పల్లె పదాలు,బతుకమ్మ పాటలు కై కట్టి చెబుతున్న కథలు ప్రజలకు చేరువవుతున్నాయి. కరోనా పై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాడిన పాటలను వీడియో రికార్డు చేసి  అధికారులు విడుదల చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విసృతంగా ప్రచారం చేసేందుకు వారు సిద్ధమయ్యారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో పల్లె పల్లెనా వైరల్ అవుతున్నాయి.ఇందులో భాగం గా వేములవాడకు చెందిన బుగ్గయ్య టీం కరొనపై చెబుతున్న ఒగ్గుకథలు ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి.


జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కరోనా పై ప్రజలను చైతన్యం చేసేందుకు ఆన్లైన్ ఆధారితంగా నిర్వహిస్తున్న ఒగ్గు కథ కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది .ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్స్ అప్ లలో వీడియోలు అత్యధికంగా షేర్ అవుతున్నాయి. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ ను, కళాకారులను అభినందిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్ట్ లు పెడుతున్నారు.

కాగా ట్విట్టర్ లో సిరిసిల్ల కలెక్టర్ ట్వీట్‌ను చూసి ప్రజలను కరొనపై చైతన్య వంతులను చేసేందుకు  సిరిసిల్ల జిల్లా అధికారులుచేస్తున్న కృషిని ఎంచుకున్న ఒగ్గుకథ విధానాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు సిరిసిల్ల కలెక్టర్ ట్వీట్‌ను చూసి రీ ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి  గ్రామీణ ప్రజలకు అర్థం అయ్యే రీతిలో చేపట్టిన ఈ కార్యక్రమం వారిని చైతన్యవంతుల్ని చేస్తుందని కార్యక్రామాలు  వండర్ ఫుల్ అంటూ అయన ప్రసంశించడం విశేషం.

You Might Also Like