సిరిసిల్లలో లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తూ హోంగార్డు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలువేరి దేవయ్య (50) సిరిసిల్ల పోలీస్‌ ష్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. కోర్డు డ్యూటీలో ఉన్న దేవయ్య, కోర్టుకు సెలవులు ప్రకటించడంతో లాక్‌డౌన్‌ విధుల్లో బందోబస్తు నిర్వహిస్తున్నాడు. బుధవారం పెట్రోలింగ్‌ విధుల్లో కానిస్టేబుల్‌తో కలిసి దేవయ్య విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో సిరిసిల్లలోని ఎల్లమ్మ చౌరస్తాలో సొమ్మసిల్లి పడిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు దేవయ్యను వెంటనే సిరిసిల్ల ఏరియా దవఖానకు తరలించారు. దవాఖానలో వైద్యులు పరీక్షించగా, అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. లాక్‌డౌన్‌ విధుల్లో వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు పేర్కొన్నారు. సీఐ వెంకటనర్సయ్య చేరుకుని పరిశీలించారు. దేవయ్యకు భార్య భారతి, కూతురు నవ్య, కొడుకులు ఉన్నారు. 

You Might Also Like