కరోనా వైరస్ ను  కట్టడి చేయడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన కరోన లాక్ డౌన్ ను విఘాతం కల్గిస్తు ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్ హేగ్డే  తెలిపారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ  వేములవాడ పట్టణంలో  కరోనా వ్యాధి నివారణకు  లాక్ డౌన్ మరింత పకడ్బందీగా నిర్వహించడానికి, డ్రోన్ కెమెరాతో ఉదయం, సాయంత్రం సమయాల్లో  పట్టణంలో ఉన్న గుడి చెరువు,గుడి పరిసరాల ప్రాంతాలు సుభాష్ నగర్, మరియు తదితర  కాలనీలలో, మరియు లాక్ డౌన్ సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్ లలో డ్రోన్ కెమెరాతో  పట్టణ పరిస్థితిని సమీక్షించినారు.

ఈ సంధర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన లాక్ డౌన్ కు వేములవాడ పట్టణ ప్రజలు జిల్లా పోలీస్ సిబ్బందికి సహకరిస్తున్నారని, కానీ కొందరు ఈ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనసరం గా ఇంట్లో నుండి బయటకు వెళ్లి రోడ్లపైకి వస్తున్నారని, ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో మాత్రమే ఇంటికి ఒకరు బయటకు వచ్చి అత్యవసర సరుకులు కొనుక్కోవాలని, అలాగే వైద్య పరంగా అత్యవసర పరిస్థితులు ఉన్నపుడే మాత్రమే బయటకు రావాలని తెలిపారు.

అలాగే  పట్టణంలో గల ప్రతి కాలనీలలో మరియు చిన్న చిన్న వీధులలో, నిత్యవసర వస్తువుల  దుకాణాల వద్ద తప్పకుండా భౌతిక దూరం పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని డ్రోన్ కెమెరాలు ఉపయోగించుకుని తెలుసుకుని  వెంటనే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే ప్రజలు ఇండ్లల్లో నుండి బయటకు వచ్చి పేకాట ఆడిన, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఈ డ్రోన్ కెమెరాతో గురించి కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యక్ష నిఘా ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్రజలు అనవసరంగా బయట తిరుగుతున్నారో  వాళ్లని అదుపులోకి తీసుకొని రోడ్డు మీద అనవసరంగా ఉంటున్న వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

పని లేకుండా రోడ్లపై మోటార్ సైకిళ్లపై తిరిగే వ్యక్తులపై డ్రోన్ కెమెరా ద్వారా  నిఘా పెట్టి వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని,  పోలీసుల సూచనలు సలహాలు పాటిస్తూ లాక్ డౌన్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీతెలిపారు. ఈ కార్యక్రమంలో  వేములవాడ టౌన్ డిఎస్పీ చంద్రకాంత్  టౌన్ సి.ఐ శ్రీధర్  పాల్గోన్నారు


You Might Also Like