అకారణం గా లాఠీని ఝళిపించిన ఓ ఎస్ ఐ పై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకున్న ఘటన వేములవాడ లో జరిగింది. వేములవాడ అర్బన్ మండలం  కొడిముంజ  గ్రామానికి చెందిన పరుశరాములను రెండు రోజుల కిందట విచక్షణ రహితంగా చితకబాదిన ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే  స్పందించారు.అందుకు బాధ్యులైన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై నరేష్ కుమార్ పై ఎస్ పి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు.వెంటనే వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో విధుల నుంచి తప్పిస్తూ జిల్లా హెడ్ క్వాటర్ కు అటాచ్ చేశారు.ఎస్ పీ నిర్ణయం పై సర్వాత్ర  హర్షం వ్యక్తమవుతోంది.

You Might Also Like