వద్దంకుల్ మా డాడీ ని కొట్టొదంటూ తన తండ్రిని ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుతుండగా  ఓ బాలుడు పడిన ఆవేదన చూసి స్పందించిన మంత్రి కేటీఆర్‌ సీషయాన్ని గమనించి చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరగా వారు స్పందించిన ఘటన ఇది.వనపర్తి జిల్లా కేంద్రంలో  పోలీస్‌ కానిస్టేబుల్‌ అశోక్‌ పట్టణానికి చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ అపూర్వరావు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రం మురళీకృష్ణ అనే వ్యక్తి నగరంలోని రామాలయం నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు తన కుమారుడితో ద్విచక్రవాహనంపై రెండు నుంచి మూడు సార్లు రాకపోకలు సాగించాడు. ఇది గమనించిన పోలీసులు మురళీకృష్ణను ఆపి లాక్‌డౌన్‌ సమయంలో బాలుడిని వెంటబెట్టుకొని తిరగడం సరికాదని హెచ్చరించారు. అదే సమయంలో మురళీకృష్ణ ద్విచక్రవాహనంపై 14 పెండింగ్‌ చలాన్లు ఉన్నాయంటూ కానిస్టేబుల్‌ అశోక్‌  నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.


అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ ఘర్షణను వీడియో తీసి ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన కేటీఆర్‌ ఘటనపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీని కోరారు. ఈ ఘటనపై స్పందించిన వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌, డీజీపీకి వనపర్తి ఎస్పీ ట్విటర్‌ ద్వారా తెలిపారు.మొత్తానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఆప్పడి  కప్పుడు స్పందిస్తు చర్యలకు ఉపక్రమించడం పలువురు ఆబినందిస్తున్నారు.

You Might Also Like