జిల్లా లో బ్లాక్ మార్కెట్ జరగకుండా ధరలు నియంత్రణలో ఉండే విధంగా జిల్లా టాస్క్ ఫోర్స్ టీమ్ బృందాలుగా ఏర్పడి అన్ని మండలాల్లో తనిఖీ చేస్తున్నాయని రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే  కరోనా వ్యాప్తి నేపథ్యంలో  వేములవాడలో లాక్ డౌన్ కోనసాగుతున్న తీరును గురువారం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూఇప్పటి వరకు మన జిల్లా లో వేరే వేరే దేశాల నుండి వచ్చిన 1032 మంది ని గుర్తించి వారిని హోమ్ క్వరంటైన్లో ఉంచడం జరిగింది అని చెప్పారు.వారికి జియోటాగ్ చేసి వారిని ప్రత్యేక బృంధాలు రోజు తనిఖీ చేస్తున్నాయి అని చెప్పారు.

మార్కజ్ వెళ్లిన వారికి మరియు వేరే జిల్లా లో కరోనా  పాజీటివ్ ఉన్న వారితో మన జిల్లాలో ఎవరికైనా సంబందాలు ఉన్నాయా అని తెలుకొని వారికి గుర్తించడం జరిగింది అని చెప్పరు.ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 4000 మంది వలస కార్మికులను గుర్తించడం జరిగింది..ఈ వలస కార్మికులకి కరోనా లాక్ డౌన్ వల్ల నమ్ముకుని వచ్చిన ఊరిలో పనులు చేసే వీలులేక సొంత రాష్ట్రానికి వెళ్లడానికి వాహనాలులేక, తినేందుకు సరుకులు కొనే స్తోమత లేక ఇబ్బంది పడుతున్న 4000 మంది వలస కార్మికులకి తినడానికి నిత్యావసర సరుకులు మరియు ఉండటానికి వసతి ఏర్పాటు చేశామని చెప్పారు.జిల్లా బార్డర్ లలో 5 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామని వీటితో పాటు జిల్లాలో కొన్ని ఫికెట్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.. 

ఈ చెక్ పోస్ట్ లు మరియు ఫికెట్లు డ్యూటీ నిర్వహిస్తున్న సిబ్బంది 24 గంటలు డ్యూటీలో ఉంటారని చెప్పారు.ప్రభుత్వం విధించిన నియమా నిబంధనలు ఉల్లంఘించిన వివిధ షాప్ ల పై 54 కేసులు పెట్టమని చెప్పారునిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన  367 వాహానాలు సీజు చేయడం జరిగింది అని చెప్పారు.జిల్లాలో ద్విచక్ర వాహనాలు 328 ఆటోలు 24 కార్లు 15 అదేవిధంగా జిల్లా లో అన్ని రేషన్ షాప్ ల ముందు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు  ధరల పట్టిక పెట్టాలని సూచించారు. 

ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు అన్నీ పూర్తిగా మూసి ఉంటాయి కాంప్లిట్ కర్ట్ల్ఫ్యు ఉంటుంది ఎవరూ బయటకు రావద్దు.అని చెప్పరు.మెడికల్ ఎమర్జెన్సీ, మరియు నిత్యవసర వస్తువులు తప్ప మిగితా అన్ని దుకాణాలు షాపులు మూసివేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అని చెప్పారు. ప్రతి పోలీస్ స్టేషన్లు ముందు భాగంలో నీళ్ళు హ్యాండ్ వాష్ సబ్బులు, డెటాల్  బాటిల్స్  హాండ్ సానిటీజర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.బ్లూ కోల్డ్స్, పెట్రోల్ కార్ సిబ్బంది, రిసెప్షన్, మరియు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది ప్రజల్లోకి వెళ్లేటప్పుడు రోడ్డుపై వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ గారు టౌన్ సి.ఐ శ్రీధర్ గారు ఎస్.ఐ రఫీక్ ఖాన్ గారు పాల్గొన్నారు.

You Might Also Like