ఈనెల 20 తర్వాత రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు లేవని రాష్ట్రంలోని పెరుగుతున్న  కరోనా  వ్యాప్తి దృష్ట్యా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులపై అనేక  సర్వే లు నిర్వహించి లాక్ డౌన్  కొనసాగిస్తేనే మంచిదని తెలంగాణలో మే 7 వరకూ లాక్ డౌన్ ను పొడగించాలని నిర్ణయించామని ప్రజలకుఇబ్బందవుతుందని తెలిసి కూడా  ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి  కె సి ఆర్  తెలిపారు.కేబినెట్ సమావేశానంతరం ఆదివారం మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తప్పవని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీని కూడా నిషేధించాలని,  ఇళ్ల కిరాయిలను మూడు నెలల పాటు వసూలు చేయకుండా ఉండే విధంగా గృహ యజమానులను కోరుతున్నామన్నారు.ఈ గండం గడిచాకా ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదా పద్దతిలో కిరాయి వాసులు చేసుకోవచ్చని ,కిరాయి దారులని  ఇబ్బంది పెడితే కేసులు నమోదు చేస్తామని ఇంటి యజమాను లని ఆయన హెచ్చరించారు.

తెలంగాణలో ఆదివారం కొత్తగా 18 కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 858కి చేరిందని చెప్పారు. వీరిలో 21 మంది మృతిచెందారని 186 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 651 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని సీఎం వివరించారు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో కరోనా కేసుల్లేవని చెప్పారు. వరంగల్‌ రూరల్‌, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో ఒక్క కేసూ లేదని సీఎం వివరించారు. కరోనా నేపత్యం లో అన్ని విమతాలకు చెందిన వ్యక్తులు వారి వారి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని రంజాన్ లాంటి పండుగను కూడా అలాగే జరుపుకోవాలని తానూ ఏ మతానికి విరుద్ధం కాదాని పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.రాష్ట్రము లో  యాదగిరిగుట్ట వేములవాడ లాంటి అన్నిముఖ్యమైన దేవాలయాలు కూడా అంతర్గత పూజలకు పరిమితం చేశామని అయన తెలిపారు.

స్థానిక ప్రజాప్రతినిధులు అద్భుతంగా పని చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ కొనియాడారు.కంటైన్‌మెంట్‌ జోన్లను బాగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని అందరినీ కోరుతున్నానని చెప్పారు. ఒక్కరు కూడా ఉపవాసం ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఇచ్చిన వేతనాలనే ఏప్రిల్‌ నెలలోనూ ఇస్తామన్నారు. గతంలో పెన్షనర్లకు ఇచ్చిన 50 శాతం వేతనాన్ని 75 శాతానికి పెంచామన్నారు.‘‘ సీఎం ప్రోత్సాహకం కింద పోలీసులకు గ్రాస్‌ వేతనంలో 10 శాతం ఎక్కువగా చెల్లిస్తాం. ప్రైవేటు విద్యా సంస్థలు ట్యూషన్‌ ఫీజు తప్ప అదనపు ఫీజులేవీ తీసుకోవద్దు.

నెలవారీగా మాత్రమే వసూలు చేయాలి.విద్యాసంవత్సరం ఫీజంతా ఓకే సారి కట్టాలని ఒత్తిడి చేయకూడదు. ఒక వేళ అలా చేస్తే 100కి డయల్‌ చేసి ఫిర్యాదు చేయండి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.తెలంగాణ వ్యాప్తంగా మే 7 వరకు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలకు ముఖ్యం గా ముఖ్యం గా స్విగ్గీ,జోమోటా ల అనుమతి రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.ఢిల్లీ సంఘటన దృష్ట్యా  ప్రభుత్వానికి టాక్స్ వస్తున్నప్పటికీ రేపట్నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయన్నారు.You Might Also Like