మొదట పారాసెటమాల్ తో కరోనా పోతదన్నతెలంగాణ  ముఖ్యమంతి కేసిఆర్ రానురాను కరోనా వైరస్ తీవ్రతను తెలుసుకున్నట్టు కనబడుతోంది అందుకే అయన సోమవారం మాస్క్ ధరించి అందరిని ఆశ్చర్య పరిచారు.ఇక తెలంగాణాలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను అనుసరించి తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారిగా మాస్క్‌లో కనిపించారు. దేశంతో పాటు తెలగాణలోకి కరోనా అడుగుపెట్టాక తొలిసారి సర్జికల్ మాస్క్‌ ధరించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటన్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అయన  మాస్క్‌ధరించడం తో పాటు సానిటైజర్తో చేతిని కడుక్కున్నాడు.కరోనా పై నేడు కూడా ఆయన పలు సమీక్షలు నిర్వహించి లాక్ డౌన్ జిఓ తదితర నిర్ణయాలపై సంతకం చేశారు.కాగా ముఖ్య మంత్రిని చూసి అధికారులు వ్యక్తిగత సిబ్బంది కుడా మాస్క్ లతో కనపడటం విశేషం.ఇప్పటికే ప్రగతి భవన్ కు వచ్చే అధికారులుమంత్రులు చేతులు కళ్ళు కడుక్కుని లోపలికి రావాలనే నిబంధన అమలు చేయడం విశేషం. 

You Might Also Like