రైతు తాను పండించిన పంటను దగ్ధం చేయటం ప్రభుత్వానికి సిగ్గుచేటని,అది మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా లో కావడం దురదృష్టకరమని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.శుక్రవారం  నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఉపవాస దీక్ష చేపట్టారు. అనంతరం అయన మీడియా తో మాట్లాడుతూ  రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పట్టకు గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆందోళనక గురవు తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని అయన మండిపడ్డారు.అధికారులు ,రైతు సమన్వయ సమితి కమిటీ సభ్యులే దళారులుగా మారారన్నారు. మార్కెట్ కమిటీ సభ్యులు రైస్ మిల్లర్లకు కొమ్ముకాస్తున్నారని సంజయ్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో మంత్రులు పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు.  సిరిసిల్లలో రైతులు ధాన్యాన్ని తగుటబెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు కావాల్సింది పొగడ్తల కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలుసుకోవాలన్నారు. లాభం సంగతి దేవుడెరుగు పెట్టుబడి వస్తే చాలని రైతు కోరుకుంటున్నాడని బండి సంజయ్ పేర్కొన్నారు. రైతుల పంటను కొనుగోలు చేయటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మామిడి, బత్తాయి, ద్రాక్ష పంట వేసిన రైతు సమస్యలు వర్ణనాతీతమన్నారు. రైతులెవరకూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వారికి బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ అందర్నీ కలుపుకుని వెళ్తున్నారని తెలిపారు.

ప్రధానికున్న సమయం సీఎం కేసీఆర్‌కు లేదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.  లాక్‌డౌన్‌ నింబంధనలు పాటిస్తూ నిరసన తెలిపినా రైతులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావంగా సాయంత్రం 5గంటల వరకు ఉపవాస దీక్ష చేయనున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు. You Might Also Like