దేశ వ్యాప్తం  గా లాక్ డౌన్ బయటకు వెళితే ఇళ్ల నుండి బయటకు రావొద్దని తరిమి కొడుతున్న పోలీసులు ఇలాంటి పరిస్థితిలో తన కుమారున్ని చూడకుండా ఉండలేని ఓ తల్లి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న తన కుమారున్ని రీసుకు వచ్చెనందుకు చేసిన సాహసం తల్లి ప్రేమను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.అందుకే అన్నారు ఓ సినీ కవి అమ్మ ప్రేమ కు ఎవరు సాటి రారని.


వివరాల్లోకి వెళితే, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలంపాడ్ ప్రాథమిక పాఠశాలలో  ఉపాధ్యాయురాలిగా విధులు సాగిస్తున్న రజియా బేగం కుమారుడు నెల్లూరులో ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో వైరస్ ప్రబలుతూ ఉండటంతో, తన కుమారుడిని అక్కడి నుంచి తీసుకుని రావాలని ఆమె నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో, బోధన్ ఏసీపీని ప్రత్యేకంగా కలిసి, అనుమతి తీసుకున్నారు.


ఆపై ఈ నెల 6వ తేదీన తన స్కూటీపై ఆమె బోధన్ నుంచి బయలుదేరి 7వ తేదీన మధ్యాహ్నానికి నెల్లూరు చేరుకున్నారు. అదే రోజు తన కుమారుడిని పిక్ అప్ చేసుకుని  ఆమె, మరుసటి రోజు అంటే, 8వ తేదీ రాత్రికి బోధన్ చేరుకున్నారు. ఇలా, 48 గంటల వ్యవధిలో ఆమె సుమారు 1,500 కిలోమీటర్లు ప్రయాణించి, తన బిడ్డను తీసుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో పలువురు ఆమెను అభినందించారు.అయితే ఇందుకు దారి పొడవునా సహకరించిన పోలీసు లకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

You Might Also Like