కరోనా వ్యాప్తి ని అడ్డుకుని  పలు రకాల సూక్ష్మక్రిములను నివారించే 3వీ సేఫ్‌ టన్నెల్‌ను తన  కార్యాలయంలో  డీజీపీ మహేందర్‌రెడ్డి  ప్రారంభించారు. ఆదివారం నుంచి డీజీపీ కార్యాలయంలోకి వచ్చే సందర్శకులు, కార్యాలయ సిబ్బంది అంతా ఈ టన్నెల్‌ గుండానే రావాల్సి ఉంటుంది.ఇందులో సోడియం హై పోక్లోరేట్‌తోపాటు మరికొన్ని రసాయనాలను చల్లే పంపులు ఉంటాయి. ఈ టన్నెల్‌లోకి మనిషిఎంటర్ కాగానే  పంపులు వాటంతట అవే రసాయనాలను స్వల్ప మోతాదులో దేహంపై పిచికారీ చేస్తా యి. ఈ టన్నెల్‌లో 20 సెకన్లపాటు ఉంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావచ్చని టన్నెల్‌ పరికరాన్ని అభివృద్ధి చేసిన వాస్కులర్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ప్రతినిధులు వివరించారు. 

You Might Also Like