తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కరోనా పేషెంట్ ల కోసం 15 అంతస్తుల్లో  భవనంలో 1500 పడకల భారీ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేస్తూనే వైద్య సదుపాయాలను పెంచుతోంది.ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కరోనా కోసం భారీ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. మర్కజ్ కేసులతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వం అప్రమత్తమై స్పోర్ట్స్‌ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చుతున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రి ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ రోజుకు వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాలు పలువురు ఉన్నతాధికారులు ఆస్పత్రి పనులను స్వయంగా పరిశీలించారు. పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 15 లోగా ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


You Might Also Like