యాదగిరి నర్సన్న,వేములవాడ రాజన్న,కొమురవెల్లి మల్లన్న,కొండ గట్టు అంజన్న ల    దర్శనం కోసం ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తులకు శుభవార్త. కరోనా నిబంధనలు పాటిస్తూ తెలంగాణా లో ని అన్ని దేవాలయాల్లో  జూన్ నెలలో తమ కిష్ట దైవాలను  దర్శనం చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం లాక్ డౌన్ 5 లో  జూన్ 8 నుండి దేవాలయం తెరిచేందుకు అనుమతి ఇవ్వగా   ఆదివారం ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రెస్ మీట్ లో దేవాలయాలు భక్తుల దర్శనానికి అనుమతిస్తే అన్ని కుదిరితే జూన్ 8   తరువాత ఆలయమ లో భక్తులను అనుమతించే అవకాశంఉంది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. వీటితో పాటు వరంగల్ లోని భద్ర ఖాళి,వేయి స్తంభాల ,సమ్మక్క సారలమ్మ సికింద్రాబాద్ గణపతి ,ఏడుపాయల వన దుర్గ,ధర్మ పూరి నర్సింహా స్వామి ఓదెల మల్లన్న చిలుకూరి బాలాజీ   దేవాలయం లు తెరుచుకునే అవాకాశంఉంది.ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో ఖచ్చితంగా   భౌతిక దూరం పాటించేలా చూడటం,   మాస్క్ ల ధరింపు  ,అనారోగ్యం , జ్వరం ,జలుబు ఉన్నవారికి అనుమతి కి నిరాకరణ   తదితర నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది.దీనికి  సంబంధించి జిల్లా మంత్రి లు  , స్థానిక  ఎమ్మెల్యే లు బాబు  , జిల్లా కలెక్టర్ లు జిల్లా  ఎస్పీ   ల సూచనల మేరకు ఆయా పోలీస్దే స్టేషన్ ల అధికారులు డే వాలయానికి చేరుకొని దేవాలయ సిబ్బందికి  పలు  సూచనలు చేశారు.భక్తుల కు ప్రత్యేక లైన్లు ,వారు దూరం దూరం గా నిలుచునేందుకు క్యూ లైన్ ల లో అర మీటర్ కొక గడి ఏర్పాటు చేయాలని కోరగా అధికారులు ఏర్పాటు  చేశారు..ధర్మ గుండ పుష్కరిణి  స్నానాలు ,భక్తుల మొక్కులు ,అంతరాలయం లో అభిషేకాలు ,స్వామి వారి కళ్యాణం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ,ఆలయ ఈ.ఓ తో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

అయితే  స్థానికులకు  దర్శనం,రద్దిగా రాకుండా వారి నియంత్రణ ఎలా  అనే అంశాలు  ప్రస్తుతం  సమస్యగా  మారాయి .స్వామి వారిని దర్శనం చేసుకోవాలంటే టిక్కెట్లను  వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎమ్మెస్ ద్వారా టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశారు. 24 గంటల ముందుగానే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లను దేవస్థానం అధికారులు చేశారు.


ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గంటకు 250 నుండి 300 మంది భక్తులకు మించకుండా దర్శనం కలిగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే దూర  ప్రాంత భక్తులకు  ఆరు తరువాత ఎక్కడ ఉండాలి అనేది నిర్ణాయించాల్సి ఉంటుంది.ఆధార్ నెంబర్‌తో సహా దర్శన సమయాన్ని ఎస్ఎమ్మెస్‌లలో  భక్తులకు సమాచారం అందిస్తారు.కాటేజీల్లోని ఒక గదిలో ఇద్దరు బస చేసేందుకు మాత్రమే అనుమతివ్వాలి. ఒకదాన్ని వదిలి మరొకటి చొప్పున ఉన్నవాటిలో మొత్తం 50 శాతం గదులనే భక్తులకు కేటాయించేందుకు 

కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించే దగ్గర క్షురకులు ప్రతిసారీ జాగ్రత్తలు తీసుకునేలా ఆలయ ప్రాంగణంలోని దుకాణాలను ఒకదాన్ని విడిచి మరోటి తెరిచేందుకు ,అన్నదానం ప్రసాదం, నిత్యాన్నప్రసాదం ఉండదు. ఆలయాల సమీపంలోని పుష్కరిణి, నదులు, చెరువుల్లో స్నానానికి అనుమతించ కుండ  శఠగోపం, తీర్థం పంపిణి నిలిపి వేస్తూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.కాగా  అంతరాలయ దర్శనం పై అధికారులు దీర్ఘం గా ఆలోచిస్తున్నారు.ఏది ఏమైనా  దేవాలయం లో స్వామి వార్లను  అమ్మవారలను పరివార దేవతలను      దూరం నుండైనా   దర్శన  భాగ్యం  కల్పించాలని స్వామి వారి దర్శనానికి తాము తహతహ లాడుతున్నామని  భక్తులు   కోరుతున్నారు .మొత్తానికి  మరో రెండు  వారాలలో ఎదో రోజు,  మంచి రోజున దేవాలయ భక్తుల ప్రవేశానికి అనుమతించే అవకాశంఉంది.

You Might Also Like