కన్న కూతురు,  మనవడు వచ్చాడని తాత  తన పొలం లో  బోరుబావి ఎపించేందుకు సిద్దమయ్యాడు.కొబ్బరి కాయ కొట్టి బోరింగ్ ప్రారంభించి నీళ్లు పడటం తో అందంగా దావత్ కు అందరికి పైసలు ఇచ్చి బోరు బావి సిబ్బందిని పంపి కాసేపు పొలం లో సేదతీరి తిరుగు ప్రయాణమయ్యారు.అంతలోనే సరదాగా అట  ఆడుతున్నట్టుగా తన వారి కంటే సంతోషంగా ముందుగా పరిగెత్తుతూ తాత భిక్షపతి, తల్లి నవీన కళ్లెదుటే అప్పుడే వేసిన బోరు బావిలో పడిపోయాడు ఆ బాలుడు.అప్రమత్తమై బాలుడుని ఏప్ ప్రయత్నం చేసే లోపే బాలుడు బావిలో పడటం తో బాలుడిని వెంటనే బయటకు తీసేందుకు తాత, తల్లి ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.. ఈలోపే బాలుడు బోరుబావిలోకి జారిపోయాడు.బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన తెలుగు రాష్టాల్లో కలకలం రేపుతోంది.

ప్రమాదవశాత్తు మరో బాలుడు బోరుబావి గుంతలో పడిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట్ మండల పరిధిలోని పొడ్చన్ పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పొడ్చన్ పల్లికి చెందిన మంగళి బిక్షపతి కూతురు నవనీతను సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరుకు చెందిన గోవర్ధన్ కు ఇచ్చి వివాహం చేశారు. కరోనా నేపథ్యంలో నవనీత తన పిల్లలతో అమ్మగారి ఊరికి వచ్చింది. అయితే బుధవారం నాడు పొలంపనుల కోసం అమ్మానాన్నలతో కలిసి నవనీత కూడా పొలం దగ్గరకు వెళ్లింది. పొలం లో నీటికోసం బోరుబావి వేయించి మనవడితో సరదాగా ఆడుకుంటుండగా  సాయివర్ధన్ ముందుగా ఉన్న  బోరుబావిలో ప్రమాద వశాత్తు పడిపోయాడు.


బాలుడిని రక్షించడానికి రంగంలోకి దిగిన అధికారులు

ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డ సాయివర్ధన్ ను రక్షించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా  అదనపు కలెక్టర్ నగేష్, పాపన్నపేట్ ఎస్ ఈ ఆంజనేయులు, రూరల్ సీఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని బాలుడి రక్షణ చర్యలపై ఆరాతీశారు. ఇప్పటికే నాలుగు జేసీబీలుతో బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వుతున్నారు. అలాగే బాలుడికి ఆక్సిజన్ అందిస్తూ ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎన్డీఆర్ ఎఫ్ బలగాలను కూడా రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బాలుడి రెస్క్యూ ఆపరేషన్‌ను మానిటర్‌ చేస్తున్న హరీశ్‌రావు

బాలుడి రెస్క్యూ ఆపరేషన్‌ను మంత్రి హరీశ్‌రావు మానిటర్‌ చేస్తున్నారు. బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని రకాల సహాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి రెస్క్యూ, ఎన్డీఆర్‌ఎఫ్‌ నిపుణులను రప్పించాలని ఆదేశించారు. బోరుబావుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే బోరుబావుల యజమానులపై చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు ఆదేశించారు.


You Might Also Like