వరిధాన్యంలో తాలు పేరుతో దోపిడిని నిరసిస్తూ ధాన్యం కొనుగోళ్లలో రైతులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం లు దీక్ష చేపట్టారు.రైతులు ధాన్యం అమ్మకం లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరించాలని కోరుతూ చొప్పదండి మండలం రుక్మాపూర్ కొనుగోలు కేంద్రం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం హాజరయ్యారు.

అనంతరం పొన్నం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం చెప్పిన మాటలకు, క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దానికి పొంతన లేకుండా పోయిందన్నారు. తాలు పేరు మీద కొనుగోలు కేంద్రాల్లోనే 40 కిలోలకు బదులు 42 కిలోలు తూకం వేయాలని పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అనధికారిక ఆదేశాలు ఇచ్చారని అన్నారు. మిల్లర్లతో రైతుకు సంబంధం లేకుండా చూడాలన్నారు. రైతులతో పాటు ఐకెపి కేంద్రాల నిర్వాహకులను కూడా మిల్లర్లు వేధిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రైస్ మిల్లర్ల యజమానులతో సీఎం సమావేశం నిర్వహించి సమస్య లేకుండా చూడాలని అన్నారు. అవసరమైతే వాళ్లకు ఎఫ్.సి.ఐ. తో మాట్లాడి రాయితీపై ఇప్పించేలా చూడాలని అన్నారు. కొనుగోలు ప్రారంభించి 15 రోజులైనా ఎక్కడా పూర్తిస్థాయిలో ధాన్యం కొనడం లేదన్నారు.

ఓ వైపు అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. ధాన్యాన్ని కాపాడుకోవడానికి కనీసం టార్పాలిన్లు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరిలో అమ్ముకున్న కందులకు ఇప్పటి వరకు నగదు రాలేదని, రాజకీయాలకు అతీతంగా ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. ఎంత వేదన ఉంటే రైతులు ధాన్యాన్ని తగలబెడతారు? ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. రైతులకు అండగా ఉండి సమస్య పరిష్కారం అయ్యే దాకా ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు.కా గా వెరీ దీక్ష ఈ సాయంత్రం తో ముగియనుంది. ఇటీవలే రైతు సమస్యలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎం పీ బండి సంజయ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.  

You Might Also Like