అసలే ఉపాధి లేక ఊసురు మంటూ తమ తమ గ్రామాలకు తిరిగి వెళుతున్నవలస కూలీలపై రోడ్ ప్రమాదం రూపంలో పంజా విసిరింది.రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద గల రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన వలస కూలీలు వెళ్తున్న వాహనాన్నివెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొక మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.


కర్నాటక చెందిన వీరంతా కృష్ణా జిల్లా నూజివీడు మామిడి తోటలో పనిచేసే కార్మికులుగా పనిచేస్తుండగా  కరోనా ప్రభావంతో పనులు లేక  తమ సొంతగ్రామం రాయచూర్ కి ట్రక్ లో బయల్దేరారు. కానీ మృత్యువు వీరిని వెంటాడింది.వీరు ప్రయాణీస్తున్న  ట్రక్ ను పెద్ద గోల్కొండ సమీపం వద్ద లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఘటనాస్థలానికి చేరుకున్న ఓఆర్ఆర్ సిబ్బంది మృత దేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఓ చిన్నారి, బాలిక ఉన్నారు. ప్రమాద సమయంలో ట్రక్ లో సుమారుల 30 మంది కూలీలు ఉన్నట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ట్రక్ ను డీకోట్టిన లారీ గుజరాత్ కి చెందినదిగా ఇక్కడి నుండి లారీలో మామిడికాయలు తీసుకెళుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

You Might Also Like