కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్‌ వద్ద వినియోగదారులు క్యూ లైన్లో రావాలని పదే పదే చెబుతు  రాంగ్  రూట్ లో వెళుతున్న  యువకులను అడ్డుకోవడం తో  విధి నిర్వాహణలో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై ఇనుప రాడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంఘటనలో ఇద్దరు నిందితులను చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇన్‌స్పెక్టర్‌ రుద్రభాస్కర్‌ తెలిపిన వివరాల ప్రకారం చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుల్‌ పి.ప్రవీణ్‌ కుమార్‌ (34),ఈ నెల 4వ తేదీన హాఫిజ్‌బాబానగర్‌ లోని  కస్టమర్‌ సర్వీస్‌ వద్ద ఉండగా  ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఇనుపరాడ్‌తో అతని తలపై కొట్టి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ కుమార్‌ను డీఆర్‌డీఎల్‌ అపోలో వైద్యశాలలో చేర్పించి వైద్య చేయించారు. అయితే దాడికి పాల్పడి పారిపోయిన నిందితులను సీసీ కెమెరా పూటేజీ ద్వారా ఫీజ్‌బాబానగర్‌ అలియా గార్డెన్‌ సమీపంలో నివసించే షేక్‌ మహముద్‌ అమీరుద్దీన్‌ అలియాస్‌ అబ్బూ (21), మెకానిక్‌.గుల్షాన్‌ ఏక్బాల్‌ కాలనీకి చెందిన షేక్‌ సైఫ్‌ మోహినుద్దీన్‌ (24), ఎలక్ట్రీషీయన్‌లు కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

You Might Also Like