1.  ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ లాక్ డౌన్ పాటించకుండా భవన నిర్మాణ పనులు కొనసాగిస్తే భవన యజమానుల పై కఠిన చర్యలు తప్పవని వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించకుండా భవన నిర్మాణ పనులు చేయిస్తే భవన యజమానులె పూర్తి బాధ్యత వహించాల్సిందే అని, యజమానులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలు సహకరిస్తేనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అని, అనవసరంగా ఇళ్ళనుండి బయటికి వచ్చి కేసులు చేసుకోవద్దని లాక్ డౌన్ ను అందరూ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

        పట్టణ పరిధిలో కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ.... లాక్ డౌన్ నిషేధ ఆజ్ఞలు పాటించకుండా రోడ్డుపైకి వాహనాలు వస్తే సీజ్ చేస్తామని సీఐ శ్రీధర్ హెచ్చరించారు. ఇక ముందు ఇంకా కఠినంగా చర్యలు ఉంటాయని... ప్రతీ ఒక్కరు ఎమర్జెన్సీ అయితే తప్ప వాహన అనుమతి తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని... ప్రజలు సహకరిస్తేనే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు.

You Might Also Like