ఢిల్లీలోని నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన నలుగురు యువకులకు ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని నిర్దారణ  అయ్యింది . కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో మంగళవారం ఉదయం ఈ నలుగురు యువకులు పట్టణానికి చెందిన మహ్మద్ అర్బాజ్ అలీ (20 ) మహ్మద్ జాకీర్ (31)హస్మత్ అలీ (21) మొహ్మద్ షాకీర్ (22 )లను  సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

వారి నుంచి నమూనాలను సేకరించిన ప్రభుత్వ వైద్యులు వాటిని వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు . 48 గంటల తరువాత వారికి ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని రిపోర్టు నెగటివ్ వచ్చినట్లు వేములవాడ వైద్యులు డాక్టర్ మహేష్ రావు , సుమన్ మోహన్ రావ్ గురువారం తెలిపారు . 

అలాగే వారందరు ఢిల్లీ నుండి వచ్చాక కలిసిన 21  మందిని చెక్కపల్లి లోని ప్రభుత్వ క్వారయింటెన్లో ఉంచుతూ మిగతా వారి ఇండ్లకు నోటీసులు జారీ చేశారు.వారిని ఇంకా వదిలివేశారా లేదా అనేది ఇంకా తెలియ రాలేదు.కాగా ఈ ప్రకటన తో వేములవాడ ప్రజలు అనడం వ్యక్తం చేస్తున్నారు.

You Might Also Like