లాక్ డౌన్ సందర్బంగా  నిత్యావసర సరుకుల రవాణా లో ప్రజలకు ఇబ్బంది కలుగకూడదు అని  వేములవాడ డీఎస్పీచంద్రకాంత్ అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో లారీ మరియు వ్యాన్ అసోసియేషన్ సభ్యులతో స్థానిక  డీఎస్పీచంద్రకాంత్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల సరఫరా లో అసోసియేషన్ వారిది   కీలక పాత్ర అని వారికి పోలీస్  సహకారం ఎప్పుడు ఉంటుంది అని సరఫరా కి కావాల్సిన అనుమతులు పోలీస్ స్టేషన్ నుండి తీసుకోవాల్సింది గా కోరారు.ప్రజలకు నిత్యావసర సరుకులు లోటు రాకుండా ఎప్పటికప్పుడు సరుకులు రవాణా చేయాలని మరియు ఇట్టి అనుమతులను దుర్వినియోగం చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ పట్టణంలో ని కిరాణా షాప్ లకి సరుకులు రవాణా చేయటానికి పోలీస్ స్టేషన్ నుండి తప్పకుండా అనుమతి తీసుకోవాలి అని ఎలాంటి సమస్య ఎదురైనా పోలీస్ వారిని సంప్రదించాలి అని అదే విధంగా డ్రైవర్స్ మరియు క్లీనర్లు రవాణా సమయం లో చాలా దూర ప్రాంతాలనుండి ప్రయాణం చేస్తారు కాబట్టి వైరస్ బారినపడకుండా సామాజిక దూరం పాటిస్తూ,  తగు జాగ్రత్త లు తీసుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమం లో స్థానిక లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

You Might Also Like