టిఆర్ కె ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఒక రకంగా చెప్పాలంటే పేదల పాలిట పెన్నిధి టిఆర్ కె ట్రస్ట్ అని  మున్సిపల్ ఛైర్ పర్సన్ రామతీర్థపు మాధవిరాజు అన్నారు. టిఆర్ కె  చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్ కుమార్ నలుగురికి సేవ  చేయాలనే మంచి ఉద్దేశంతో ట్రస్టు ఏర్పాటు చేశారని, అలాగే ఆపద సమయంలో తమ వంతు  చేయూతగా సహాయం అందజేస్తున్నారన్నారు.  సోమవారం 22, 26 వార్డుల్లో ట్రస్ట్ డైరెక్టర్లు గోలి శ్రీనివాస్,  మొట్టల మహేశ్, బూర సదానందం, కార్యదర్శి నాయిని శేఖర్ లు  అర్హులైన నిరుపేదలను గుర్తించి  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  అలాగే ఇతర రాష్ట్రాల నుండి జీవనోపాధి నిమిత్తం వచ్చిన వలస జీవులకు టి ఆర్ కె ట్రస్టు తరపున నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రాజు  వార్డులలో కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ తో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు  ముప్పిడి సునంద-శ్రీనివాస్, అన్నారం ఉమారాణీ శ్రీనివాస్, ట్రస్టు సభ్యులు దీపక్, ప్రతాప్, సంతోష్, ప్రేమ్, శ్రీధర్, రాకేష్, నితిన్, సందీప్, సాయి,  కృష్ణ, నాగరాజులు పాల్గొన్నారు.

You Might Also Like