జర్నలిస్ట్ అంటేనే డబ్బులు డిమాండ్ చేస్తాడు,అడ్ లు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తారు అనే చులకనైనా భావన ప్రజల్లో ఉన్న ఈ రోజుల్లో పేదలకు సేవ చేసే వారు ఉంటారని అవస రమైతే తాము కూడా తమ జేబులో నుండి డబ్బులు ఇచ్చి మానవత్వం చాటుకునేందుకు   కొందరు నికార్సైన జర్నలిస్ట్ లు  ఉంటారని నిరూపించే సంఘటన ఇది.  కరోనా వైరస్ ను అరికట్టే క్రమంలో లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో నిరాశ్రయులు, వృద్దులు ,పేదల ఆకలి తీర్చేందుకు టీయూడబ్ల్యుజే (ఐజేయూ) అనుబంధ సంస్థ అయిన వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హింగే శ్రీనివాస్ 14,400 రూపాయల తన స్వంత డబ్బులు విరాళం గా  అందజేశారు.

అన్నపూర్ణ పథకం ద్వారా పురపాలక సంఘం ఆధ్వర్యంలో రోజుకు 300 మందికి ఉచిత భోజనం అందజేస్తుండగా, రెండు రోజుల భోజనం అందించేందుకు గాను  తన వంతుగా 14.400 రూపాయల చెక్కును మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాసరెడికి హింగే శ్రీనివాస్ సోమవారం అందజేశారు. అన్నదానం కోసం విరాళంఅందజేసిన జర్నలిస్టు హింగే శ్రీనివాసు  ను ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు పలువురు మిత్రులు సన్నిహితులు వివిధ పార్టీల నేతలు,సామాజిక కార్యకర్తలు అభినందిం చారు.శ్రీనివాస్ ఈ ఒక్కసందర్భం లోనే కాకుండా పలు మార్లు పలువురికి గుప్తదానాలు చేయడం తో పాటు రోగులకు కొన్ని సార్లు మందులు ఉచితం గా అందించి తన దాతృత్వం చాటుకుంటాడు.వెల్ డన్ సోదరా...

You Might Also Like