వేములవాడ పట్టణంలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడం తో అతడు నివసించిన సుభాష్ నగర్ నుండి అటు ఉప్పు గడ్డ వరకు ఇటు పద్మశాలీకల్యాణ మండపం వరకు అధికారులు రెడ్ జోన్  గా ప్రకటించారు. ఇతని తో పాటు ఢిల్లీవెళ్లిన మరో ముగ్గురిని క్వారంటైన్ లోనే ఉంచగా అతని తో తిరిగిన,  సన్నిహితంగా మెలిగిన 28 మంది ని అధికారులు గుర్తించారు. వీరిలో 12 మందిని హైరిస్క్ వ్యక్తులుగా, మిగితావారిని రిస్క్ వ్యక్తులుగా ప్రాథమికంగా నిర్ధారించారు.వీరందరిని స్థానిక లక్ష్మి గణపతి కాంప్లెక్స్ లోకి పంపి క్వారంటైన్ లో ఉంచుతూ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరంతా  ఇప్పటి వరకు ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా గుర్తించి ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్ళకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు.

ఈ ఉదయం ఆ ఏరియాలో ఉన్నవారిని కనీసం ఇంటి నుండి బయటకు రానివ్వలేదు.వారందరికీ మున్సిపల్ అధికారులు నిత్యావసర వస్తువులు పాలు అందజేశారు.ఇటివలే బైపాస్ లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ ను కూడా అక్కడినుండి ఎత్తి వేశారు.ఈ దిగ్బంధనం ఎన్ని రోజులు ఐఉంటుందని రెడ్స్థా జోన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇక  సి ఐ శ్రీధర్ డిఎస్పీ చంద్రకాంత్ నేతృత్వం లో ఈ ప్రాంతంలో గట్టి బందోబస్తు కొనసాగుతుండాగా సాయంత్రం జిల్లా ఎస్ పి రాహుల్ హెగ్డే  ఓపెన్ జిమ్ వద్ద సుభాష్ నగర్ లో పరిస్థితులనుసమీక్షించారు.డ్రోన్ లతో ఇంటి నుండి బయటకు వచ్చిన వారిని గుర్తించేందుకు ఈ ప్రాంతం లో డ్రోన్ లు ఏర్పాటు చేసారు. ,ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పట్టణం లో డాక్టర్ మహేష్ రావు నేతృత్వంలో వాడ వాదన వైద్య బృందాలు తిరుగుతున్నాయి.మొత్తానికి వేములవాడ లో ప్రజలుకరోనా తో బిక్కు బిక్కు మంటూ కాలం వేళ్ళ దీస్తున్నారు.

You Might Also Like