పోలీస్ శాఖ తరుపున వేములవాడ లో ఉన్న 25 మంది వలస  కార్మికులకు శనివారం వేములవాడ పట్టణ సీఐ శ్రీధర్ నిత్యావసర సరుకులు అందజేశారు.పట్టణం లో  ఉన్న రాజస్థానుకు  చెందిన మార్బుల్ కూలీలకు చేసేందుకు పనిలేక తినేందుకు సరుకులు లేక అవస్థలు పడుతుండటం తో వారికి పోలీస్ శాఖ తరుపున సహృదయం తో సి ఐ శ్రీధర్  గోధుమ పిండి, ఆలుగడ్డలు, వంటనూనె ను అందజేశారు. అనంతరం సీఐ వారికి కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. లాక్ డౌన్ కి ప్రజల అందరు సహకరించాలని కోరారు. అత్యవసర సమయంలో తప్ప బయటకు రాకూడదు అని, బయటీకి వస్తే మాస్కులు పెట్టుకోవాలని వారికి సూచించారు. అనంతరం వారు వేములవాడ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

You Might Also Like