వేములవాడ పట్టణంలో రోడ్డుపై  తిరుగుతున్న గోవులకు ఆహారాన్నిఅందించి  మానవత్వాన్ని చాటుకున్నారు పలువురు యువకులు .పట్టణంలోని దేవి లేడీస్ ఎంపోరియం  ప్రదీప్ ఇంతియాజ్, కనికరపు రాకేష్ లు పలురకాల పండ్లను, కూరగాయలను కొనుగోలు చేసి వాటికి వేశారు. అయితే గత వారం రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను ప్రకటించడంతో ఊరు పై తిరుగుతూ గ్రామస్తులు, దుకాణదారులు వేసే తదితర ఆహార పదార్థాలను తిని జీవిస్తున్న ఈ ఆవులకు ఎలాంటి ఆహారం దొరకకపోవడాన్ని  గమనించి వీటికి ఆహారం అందించారు.  వీరికి ఆహారం అందించినందుకు పలువురు ఆ యువకులను అభినందించారు

You Might Also Like